: పండగ నాడూ అనంతపురంలో ఆగని ఆందోళనలు
వినాయక చవితి పర్వదినాన కూడా సమైక్యవాదులు తమ ఆందోళన బాట వీడలేదు. అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర నిరసనలు మిన్నంటుతున్నాయి. ఉరవకొండలో టీడీపీ నాయకులు రాష్ట్ర విభజన నిరసిస్తూ రోడ్డుపై స్నానాలు చేశారు. అనంతరం సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు, ఎన్జీవోలు అంబేద్కర్ సర్కిల్ వద్ద మోకాళ్లపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుమీద మోకాళ్లపైనే నడుస్తూ సమైక్యనినాదాలు చేశారు. రోడ్డు మీద వెళ్లే వాహనాలు తుడుస్తూ తమ నిరసన తెలిపారు.