: అమ్మో బొమ్మ...


పిల్లలు సరదాగా ఆటలు ఆడుకుంటుంటే చూడడానికి మనకు కూడా సరదాగా ఉంటుంది. అందునా రిమోట్‌తో నడిచే బొమ్మలంటే ఇష్టంలేనిది ఎవరికి చెప్పండి... పిల్లలందరికీ ఇలాంటి బొమ్మలంటే చాలా ఇష్టం. అయితే అదే ఆట వారి ప్రాణం తీస్తే... వినేందుకు విడ్డూరంగా ఉంది కదూ... నిజంగానే ఒక ఆటబొమ్మ ఒక పిల్లవాడి ప్రాణం తీసింది. దీంతో అమ్మో బొమ్మా... అనాల్సి వస్తుంది.

అమెరికాలోని బ్రూక్‌లిన్‌లో పంతొమ్మిదేళ్ల రోమన్‌ పిరోజెక్‌కు రిమోట్‌ కంట్రోల్‌తో నడిచే హెలికాప్టర్‌ బొమ్మతో ఆడుకోవడం సరదా. అక్కడే దగ్గరగా ఉండే ఒక పార్కులో ఇలా తన బొమ్మ హెలికాప్టరుతో ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఆ బొమ్మ వెనక్కి ఎగురుకుంటూ వచ్చి పిరోజెక్‌ తలను బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు మరణించాడు. బొమ్మ తలను బలంగా ఢీకొట్టడం వల్లే అతడు మృతిచెందినట్టు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి మీ పిల్లలకు బొమ్మలను కొనిచ్చే సమయంలో కాస్త జాగ్రత్తగా బొమ్మలను ఎంపికచేయండి!

  • Loading...

More Telugu News