: ఏసీఏలో ముదురుతున్న వివాదం


ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గోకరాజు కుటుంబ వ్యవహారంగా మారిందని ఎసీఏ మాజీ కార్యదర్శి చాముండేశ్వరీనాధ్ విమర్శించారు. వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన తరుపున కుమారుడ్ని పంపారని చాముండి ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో స్టేడియాల కోసం తీసుకున్న వందల ఎకరాల భూ కేటాయింపుల్లో గోకరాజు అవినీతికి పాల్పడ్డారని చాముండి ఆరోపించారు. భూవివాదాలపై ఎసీఏ అధ్యక్షుడు గోకరాజుపై అవినీతి నిరోధక శాఖ విచారణ వేగవంతం చేయాలని చాముండి డిమాండ్ చేశారు. తన స్వార్థం కోసం సచిన్ లాంటి దిగ్గజ ఆటగాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోకరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చాముండి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News