: గురు భక్తిని చాటుకున్న రజనీకాంత్


దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా తనకు చదువు చెప్పిన గురువు బి.ఎం. శాంతమ్మ (79)కు ఆర్ధిక సాయం చేసి తన గురుభక్తిని చాటుకున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను ఎంత ఎత్తుకు ఎదిగినా మర్చిపోరాదని రుజువుచేశారు. సెప్టెంబర్ 5 న ఈ సహాయాన్ని అందజేయాలని భావించినా విదేశాలకు వెళ్ళాల్సి రావటంతో శనివారం అక్కడి నుంచే తన గురువు శాంతమ్మ బ్యాంకు ఖాతాకు రూ.3 లక్షలు పంపారు. పదవీ విరమణ పొంది ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న శాంతమ్మ శిష్యుడి అభిమానానికి ఆనంద భాష్పాలు రాల్చి, తన హర్షాన్ని వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News