: పార్లమెంటు దాడిపై అఫ్జల్ రాసిన లేఖను ప్రచురించిన కాశ్మీర్ ఉర్దూ పత్రిక
పార్లమెంటుపై దాడి ఘటనపై వివరిస్తూ ఉగ్రవాది అఫ్జల్ గురు 2008లో కాశ్మీర్ ఉర్దూ పత్రిక ‘ఖామీ వక్రి’ ఎడిటర్ షబ్నమ్ ఖయ్యూమ్ కు రాసిన వివరాణాత్మక లేఖ తాజాగా బయటికొచ్చింది. ఈ లేఖను ఈ రోజు ఆ పత్రిక ప్రచురించింది. అందులో 2001 డిసెంబర్ 31న ఢిల్లీలో పార్లమెంటుపై చేసిన దాడిని గురు సమర్ధించుకున్నాడు.
"పార్లమెంటుపై దాడి ఘటనను ఓ కుట్రగా పిలవద్దని మీ (పత్రిక ఎడిటర్) ద్వారా హిజ్బల్ ముజాహిద్దీన్ మిలటరీ కమాండర్ సయద్ సలాబుద్దీన్ కు విజ్ఞప్తి చేస్తున్నాను. అలా అనటం నా హృదయాన్నితీవ్రంగా బాధిస్తోంది. ఈ ఘటన జరగటానికి కాశ్మీర్ తో సంబంధం ఉంది. కాబట్టి, డిసెంబర్ 13 ఘటన కుట్ర అయితే మొత్తం కాశ్మీర్ మిలిటెన్సీ
కూడా కుట్రే అవుతుంది. కనుక మనం ఆ ఘటనకు బాధపడాల్సిన అవసరం లేదు.
కాశ్మీర్లో పేలుళ్లు జరిగినప్పుడు ఎంతోమంది శవాలుగా మారారు. అమాయకులైన
ప్రజలు రక్తపు మడుగుల్లో తేలియాడారు.
ఇంత జరిగినా మనమెందుకు బాధపడాలి? కాశ్మీర్ పై జరుగుతున్న హేయమైన చర్యలను భారతీయ పాలకులు అవమానంగా భావించడం లేదు. భారత్ లో కాశ్మీర్ భాగమని చెప్పుకుంటున్నవారే తమ సొంత ప్రమాణాలను తుంగలో తొక్కుతున్నామని ఏనాడు పశ్చత్తాపం చెందలేదు. ఒకవేళ పార్లమెంటు ఘటన ఇండియన్ల హృదయాల్లో ఓ గాయం అయితే, మరి గాయపడిన కాశ్మీర్ హృదయాలకు పరిహారంగా వారు ఏమి చెల్లిస్తారు? ఈ విషయంలో నేనేమి చేసినా దాయాలనుకోవటం లేదు. ఎందుకంటే విరోధమనేది మన హక్కు" అని అఫ్జల్ లేఖలో స్పష్టంగా రాశాడు. కాగా, ఈ నెలలోనే భారత ప్రభుత్వం అఫ్జల్ గురుని ఉరితీసిన సంగతి తెలిసిందే.
ఇంత జరిగినా మనమెందుకు బాధపడాలి? కాశ్మీర్ పై జరుగుతున్న హేయమైన చర్యలను భా