: ఏటీఎం చోరీ కేసులో నిందితుల అరెస్ట్
ఏటీఎంలో నింపాల్సిన డబ్బుతో ఉడాయించిన నలుగురు వ్యక్తులను హైదరాబాదు వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏటీఎంలో నింపాల్సిన రూ. 33 లక్షలతో సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది పరారయ్యారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు... పరారయిన నలుగురు సెక్యూరిటీ సిబ్బందిని ఈ రోజు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.