: పంటలు ఎండిపోతున్నాయి.. నీరివ్వండి: సీఎంకు బాబు లేఖ
చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నా రైతులు ఇంకా సహనం పాటిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఒక్కసారి నీరు విడుదల చేస్తే పంట చేతికొస్తుందని తాను సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినట్టు బాబు వెల్లడించారు. రైతులు ఇంటికి ఒకరు చొప్పున మహాధర్నాలో పాల్గొంటే ప్రభుత్వం తప్పక దిగివచ్చి సాగునీరు అందిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
గట్టిగా ఏదన్నా మాట్లాడితే కేసులు పెడతామని మంత్రులు బెదిరించే పరిస్థితి నెలకొందని బాబు చెప్పారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ అంశం అమల్లో పెడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం బాబు పాదయాత్ర గుంటూరు జిల్లాలో కనగాళవారి పాలెం, మైనేనివారి పాలెం మీదుగా సాగుతోంది.