: బాలరాజుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి : వీహెచ్


తెలంగాణవాదులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి బాలరాజుపై దాడి చేసింది వైసీపీ నేత మదన్ మోహన్ రెడ్డేనని వీహెచ్ ఆరోపించారు. 24 గంటల్లోగా అతన్ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమైక్యవాదుల సభకు ఉద్యోగస్తులే కాకుండా బయటి వ్యక్తులు కూడా వచ్చారని అన్నారు. గజల్ శ్రీనివాస్ ను సభకు ఎలా అనుమతించారో చెప్పాలని అన్నారు. తెలంగాణవాదులపై సమైక్యవాదులే దాడులు చేసి... తిరిగి వారే కేసులు పెడుతున్నారని వీహెచ్ తెలిపారు.

  • Loading...

More Telugu News