: భారత్-ఎ మెడలో విజయహారం


విశాఖపట్నంలో జరిగిన తొలి వన్డేలో భారత్-ఎ జట్టు 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్-ఎ జట్టును చిత్తు చేసింది. కివీస్ విసిరిన 258 పరుగుల విజయలక్ష్యాన్ని భారత కుర్రాళ్ళ జట్టు మరో 35 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (103) అద్భుత సెంచరీతో అలరించగా, మరో ఓపెనర్ ఉన్ముక్త్ చాంద్ (94) చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. దీంతో, భారత్ 44.1 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 261 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది. ఈ విజయంతో భారత్-ఎ మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. కాగా, ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈనెల 10న ఇదే మైదానంలో జరగనుంది.

  • Loading...

More Telugu News