: సమరభేరి మోగించిన సీమాంధ్ర న్యాయవాదులు


హైదరాబాదులో ఏపీఎన్జీవోలు విజయవంతంగా నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ ఇతర రంగాలవారికి స్ఫూర్తి కలిగిస్తోంది. ఈ క్రమంలో సీమాంధ్ర న్యాయవాదులు ఈ నెల28న రాజధానిలో భారీ బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు. నేడు హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భేటీ అనంతరం జేఏసీ చైర్మన్, మాజీ అడ్వకేట్ జనరల్ సీవీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 14న అనంతపురంలో సమావేశమై సభ తీరుతెన్నులపై చర్చిస్తామని తెలిపారు. అనంతపురంలో జరిగే సమావేశానికి హైకోర్టు నుంచి 200 మంది న్యాయవాదులు వస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News