: 12కు చేరిన మృతుల సంఖ్య.. పరిహారాన్ని పెంచిన యూపీ సర్కారు
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలలో జరిగిన మత ఘర్షణలలో మరణించిన వారి సంఖ్య 12కు చేరుకుంది. పలు ప్రాంతాలలో విధించిన కర్ఫ్యూ కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటి వరకూ 30 మందిని అరెస్ట్ చేశారు. అల్లర్లను అదుపు చేయడానికి సైన్యం రంగంలోకి దిగింది. అల్లర్ల ప్రాంతాలలో సైనికులు మార్చ్ నిర్వహించారు. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, శాంతియుతంగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిహారాన్ని పెంచింది. ఒక్కో కుటుంబానికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు, జర్నలిస్టుల కుటుంబాలకు 10 నుంచి 15 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించనున్నట్లు ప్రకటించింది.