: సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ, బంద్ నేపథ్యంలో 366 మంది అరెస్ట్: సీపీ
ఏపీఎన్జీఓల సభ, బంద్ నేపథ్యంలో నగర వ్యాప్తంగా 366 మందిని అరెస్టు చేసి విడుదల చేసినట్టు సిటీ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు పూర్తిగా సక్సెస్ అయ్యారని ఆయన కితాబిచ్చారు. మొత్తం మీద సెంట్రల్ జోన్ లో 147, ఈస్ట్ జోన్ లో 94 , వెస్ట్ జోన్ లో 39, నార్త్ జోన్ లో 86 మందిని అరెస్ట్ చేసినట్టు ఆయన ప్రకటించారు. నగరంలో బలవంతంగా దుకాణాలు మూయించే ప్రయత్నాలు జరిగాయని, కొన్ని చోట్ల రాళ్ల దాడులు, 8 ప్రాంతాల్లో ర్యాలీలు, 12 చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయని ఆయన తెలిపారు.