: పిల్లల తగాదాల్లోకి పెద్దలొద్దు


మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా... వాళ్ల మధ్య తగాదాలు వస్తున్నాయా... అయితే మీ పెద్దరికాన్ని నెత్తినవేసుకుని వారి తగాదాల్లోకి దూరేయకండి. వారి గొడవలు వారే సర్దుబాటు చేసుకునేలా చూడండి. అలాకాకుండా పెద్దరికాన్ని మీరు నెత్తినేసుకుని వారి తగాదాల్లో తలదూర్చవద్దని పరిశోధకులు చెబుతున్నారు.

పిల్లలు ఇంట్లో తగాదాలు వేసుకోవడం సహజం. పిల్లల తగాదా అని తేలిగ్గా తీసిపారేయకూడదట. అలాగని పిల్లల తగాదాల్లోకి పెద్దలు దూరి వారి తగవులు తీర్చడానికి ప్రయత్నించకూడదట. చిన్న వయసులో తోబుట్టువుల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలు పెద్దయ్యాక వారిలో లేనిపోని ఆందోళనకు, కుంగుబాటుకు, ఆత్మన్యూనతా భావానికి దారితీస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. పెద్దలు పిల్లల తగాదాల్లో తలదూర్చి తీర్పు చెప్పడానికి సిద్ధపడిపోకూడదని కూడా ఈ అధ్యయనం చెబుతోంది. మిస్సోరి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో పిల్లల్లో ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లల్లో వచ్చే తగాదాల్లో పెద్దవాళ్లు జోక్యం చేసుకుంటే పరిస్థితి మరింత చికాకుగా తయారవుతుందనీ, కాబట్టి వారి సమస్యకు వారినే ఒక పరిష్కారం వెదుక్కునేలా సమస్యను వారికే వదిలేయడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News