: తెలంగాణవాదులకో న్యాయం, సీమాంధ్రులకో న్యాయమా?: డీకే అరుణ


హైదరాబాదులో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ నేపథ్యంలో మంత్రి డీకే అరుణ పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రలో నెలకు పైగా సాగుతున్న ఉద్యమంలో ఎవరినీ ఏమీ అనని పోలీసులు, నేడు హైదరాబాదులో తెలంగాణ విద్యార్థులపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణవాదుల పట్ల పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తెలంగాణవాదులకో న్యాయం, సీమాంధ్రులకో న్యాయమా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News