: ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లు ఆమోదం
ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పును విభేదిస్తూ జైళ్ళలో ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు మోక్షం కలిగింది. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి కపిల్ సిబాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో ఆ బిల్లుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పుపై సిబాల్ మాట్లాడుతూ.. తీర్పును సవరించాల్సిన బాధ్యత పార్లమెంటుపై ఉందని తెలిపారు.
బీజేపీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. గత నెల 27న రాజ్యసభ బిల్లును ఆమోదించింది. జైల్లో ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయాడానికి అనర్హులంటూ జూలై 10 న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై మెజారిటీ పార్టీలు మండిపడ్డాయి. ఇది దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని ఆందోళనతో సుప్రీం కోర్టు తీర్పుతో విభేదిస్తూ చట్టం చేశాయి.