: ఇరు ప్రాంతాల్లో అమాయకులే బలయ్యారు: అశోక్ కుమార్
ఉద్యమాల కారణంగా ఇరుప్రాంతాల్లోనూ అమాయకులే బలయ్యారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ అన్నారు. హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఆయన మాట్లాడుతూ, రెండు ప్రాంతాల్లో ఉద్యమం సందర్బంగా ఏ ఒక్క రాజకీయనేతా నష్టపోలేదని చెప్పారు. రాజకీయ నాయకుల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సామాన్యులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సభకు హాజరైన సమైక్య వాదులందరికీ అశోక్ బాబు ధన్యవాదాలు తెలిపారు. విభజన సమస్య ఒక్క ఉద్యోగులదే కాదని ప్రజలందరిదీ అని స్పష్టం చేశారు. అయితే విభజన జరిగితే ఎక్కువగా నష్టపోయేది విద్యార్థులు, ఉద్యోగులేనన్నారు. సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా రాజకీయ నేతల్లో చలనం లేదని ఆరోపించారు. పదవులకు రాజీనామా చేయని ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని సూచించారు.