: మన్మోహన్, సోనియా అజ్ఞానులు: చంద్రబాబు
తెలుగువారి ఆత్మగౌరవ యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూపీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కృష్ణా జిల్లాలో యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓవైపు రూపాయి పతనమై ధరలు పెరిగిపోతుంటే దానిని అదుపు చేయాల్సింది పోయి లక్షా ముప్పైవేల కోట్ల రూపాయల ఆహారభద్రత బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు. దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ దారుణంగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. సోనియాకు కనీస అర్హత లేదని ఏదో చిన్న ఉద్యోగం కోసం ఇంగ్లిష్, ఫ్రెంచ్ నేర్చుకుందని అన్నారు. అలాంటి సోనియా గాంధీ దేశంలో చక్రం తిప్పుతోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ-గవర్నెన్స్ ప్రవేశపెట్టింది తామేనని ఆయన అన్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ రాష్ట్రానికి వచ్చి అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు.