: 'సభ' మొదలైంది
వారం రోజులుగా తీవ్ర చర్చనీయాంశం అయిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ మొదలైంది. వేదికపైకి సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నాయకులు చేరుకున్నారు. తొలుత ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు వేదికపైకి విచ్చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయ సంఘం, మునిసిపల్ ఉద్యోగుల సంఘం, ఇతర ఉద్యోగ సంఘాల నేతలను వేదికపైకి ఆహ్వానించారు.