: ఏడుగురు తాలిబాన్ తీవ్రవాదులను విడిచిపెట్టనున్న పాకిస్తాన్


పాకిస్తాన్ తన బుద్ది మార్చుకోవడం లేదు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తామంటూనే... టెర్రరిస్టులకు చేయూతనందిస్తోంది. తన కస్టడీలో ఉన్న ఏడుగురు కరడుగట్టిన తాలిబాన్ తీవ్రవాదులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ సమస్యను రాజకీయపరంగా పరిష్కరించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపింది. రెండు వారాల క్రితమే ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్.. పాకిస్తాన్ ను సందర్శించారు. ఇంతలోనే పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అంతర్జాతీయ విశ్లేషకులను సైతం ఆశ్యర్యానికి గురిచేస్తోంది.

  • Loading...

More Telugu News