: ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర న్యూడెమోక్రసీ, 'టఫ్' నేతల అరెస్టు
తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కు మద్దతుగా న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టఫ్) నేతలు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్థం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న విమలక్క, సంధ్య, గోవర్థన్, మరికొందరు తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు.