: అక్బరుద్దీన్ కు అస్వస్థత..అపోలో ఆసుపత్రిలో చికిత్స
హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మంగళవారం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అక్బర్ ను హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించగా..వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇవాళ ఉదయమే వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆయన నిజామాబాద్ న్యాయస్థానం ముందు హాజరయ్యారు.