: గజల్ శ్రీనివాస్, వంగపండులను అనుమతించని పోలీసులు


ప్రఖ్యాత గజల్ గాయకుడు శ్రీనివాస్, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావులకు నిరాశ ఎదురైంది. ఏపీఎన్జీవోలు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో జరుపుతున్న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వీరిద్దరూ హాజరవ్వాలనుకున్నారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. కేవలం ఉద్యోగులకు మాత్రమే సభా ప్రాంగణంలోకి ప్రవేశించే అనుమతి ఉందని వారు శ్రీనివాస్, వంగపండులకు తెలిపారు. దీంతో వారు స్టేడియం బయటే వేచి చూస్తున్నారు.

  • Loading...

More Telugu News