: రష్యా నుంచి తిరుగుముఖం పట్టిన ప్రధాని
జి20 సమావేశాలు ముగియడంతో ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా నుంచి భారత్ కు తిరుగు ప్రయాణమయ్యారు. రెండు రోజుల పాటు సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన సదస్సులో వర్ధమాన దేశాలలో వృద్ధిని వేగవంతం చేసేందుకు చిత్తశుద్ధితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆయన జి20 సభ్య దేశాల నేతలను కోరారు. అలాగే, కరెన్సీ విలువల పతనాలపైనా ఆయన చర్చించారు.