: భారీ నష్టాలతో ముగిసిన ఐబీఎల్ తొలి సీజన్!


ఎన్నో కొత్త ఆశలతో ఈ ఏడాది ప్రారంభించిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) నిర్వాహకులు తొలి సీజన్లోనే తీవ్ర నష్టాలు చవిచూశారు. ఈ సీజన్లో దాదాపు రూ.25 కోట్లు నష్టం వాటిల్లిందని టోర్నమెంట్ కమర్షియల్ భాగస్వాములు తెలిపారు. మొత్తం ఈవెంట్ నిర్వహణకు రూ.85 కోట్లు ఖర్చవగా అందులో 65 నుంచి 70 శాతం (రూ.60 కోట్లు) ఆదాయాన్ని మాత్రమే పొందామని, మిగతా అంతా కోల్పోయామని స్పోర్టీ సోల్యూషన్స్ యజమాని ఆశిష్ చద్దా తెలిపారు.

స్పాన్సర్ షిప్ ఫీజుతో కలిపి వొడాఫోన్, మీడియా రైట్స్, మర్కండైజ్ సేల్స్, గేట్ కలెక్షన్స్ గా ఆరు ఫ్రాంఛైజీల్లో ఒక్కో జట్టు నుంచి రూ.3.5 కోట్లు వచ్చిందన్నారు. అయితే, వచ్చే ఏడాది ఇందులోకి మరింతమంది ఇన్వెస్టర్లను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. జులైలో జరిగిన వేలం సమయంలో కొంతమంది ఇన్వెస్టర్లు అనూహ్యంగా బయటికి వెళ్లారని దాంతో, తెలిసిన వారినుంచి కాక తమ డబ్బును కూడా ఇందులో పెట్టామని స్పోర్టీ సొల్యూషన్స్ యాజమాన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో 10 నుంచి 15 శాతం వాటాలను అమ్మనున్నట్లు వారు తెలిపారు. అంతేగాక మరిన్ని జట్లను ఆహ్వానించనున్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News