: ప్రయాణికులకు భద్రత కల్పిస్తాం: పోలీసులు


రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదుకు వచ్చే ప్రయాణికులకు భద్రత కల్పిస్తామని అడిషనల్ డీజీ కౌముది తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు, ఆటంకం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి నుంచి ఈ ఉదయం వరకూ హైదరాబాదుకు వచ్చిన పలు బస్సులపై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో కౌముది ఈ ప్రకటన జారీ చేశారు. మరోవైపు రైలు ప్రయాణికులకు కూడా భద్రత కల్పిస్తామని రైల్వే ఎస్పీ వెల్లడించారు. అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News