: నిజాం కళాశాల హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థుల రాళ్లదాడి


హైదరాబాదులోని నిజాం కళాశాల వసతి గృహం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వసతి గృహం ఎల్బీ స్టేడియానికి సమీపంలో ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి ఇతరులను బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. పోలీసుల వైఖరితో విభేదించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంతేకాదు పోలీసులపైకి రాళ్ల దాడితో విరుచుకు పడుతున్నారు. మరికొందరు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఇంకొందరు వసతి గృహం భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా పోలీసులు వసతి గృహానికి చెందని వారిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకు దిగిన వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభకు వస్తున్న వారిని మరో ద్వారం నుంచి లోపలికి పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News