: అర్ధరాత్రి పలు బస్సులపై రాళ్ళదాడి


ఖమ్మం జిల్లాలో ఏపీఎన్జీవోల బస్సుపై దాడి జరిగింది. బస్సుపై గుర్తు తెలియని వ్యకి రాయి విసరడంతో బస్సు అద్దం ధ్వంసమయింది. పెనుబల్లి మండలం మందాలపాడు వద్ద ఈ ఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతల పూడి నుంచి ఈ బస్సు హైదరాబాద్ వెళ్తుంది. ఇదే సమయంలో బస్సు దిగిన వెంకట్రామయ్య, చింతలపూడి ఇఓ తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్-విజయవాడ రహదారిపై ప్రయాణీకులతో వెళ్తున్న పలు బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ దాడి చేశారు. సూర్యాపేటలో సత్తుపల్లి కి చెందిన ఆర్టీసీ బస్సుపైకి రాళ్ళు విసిరారు.హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్ట వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ, నల్గొండ వెళ్తున్న మూడు ప్రైవేటు బస్సులు, ఒక ఆర్టీసీ బస్సుపై రాళ్ళ దాడి జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ,భూత్ పూర్ ల మధ్య మూడు ప్రైవేటు బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు విసిరారు. ఈ ఘటనలో 10మంది గాయపడ్డారు. దీంతో వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News