: కృష్ణా జిల్లాలో ప్రవేశించిన బాబు యాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. గుంటూరు జిల్లాలో 1 వ తేదీన యాత్ర ప్రారంభించిన చంద్రబాబు నాయుడు నేడు ఆరోరోజు ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రవేశించారు. ఆరు రోజులలో 5 నియోజకవర్గాల్లో బాబు యాత్ర కొనసాగింది.