: జుబిన్ మెహతాకు 'ఠాగోర్ అవార్డ్'
తన సంగీతంతో శాంతి సందేశాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ కండక్టర్ జుబిన్ మెహతాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 'ఠాగోర్ అవార్డ్' ను బహుకరించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ మధ్య కాశ్మీర్ లో ఆయన సంగీత కార్యక్రమాన్ని నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం భావించింది. ఇందుకు అక్కడి వేర్పాటువాద నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై ఈ సందర్భంగా జుబిన్ మెహతా మాట్లాడుతూ.. తాను కాశ్మీర్ ను ఎంచుకోకపోయినా, కాశ్మీర్ తనను ఎంచుకుందన్నారు. ముంబయిలో పుట్టిన మెహతా ఇప్పటివరకు పలు దేశాల్లో అద్భుతమైన సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.