: దుర్మార్గ రాజకీయాల ఫలితమే విభజన: చంద్రబాబు


దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్న ఫలితమే విభజన కుట్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బస్సు యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, ఇంట్లో విభేదాలు వస్తే కుటుంబసభ్యులందరినీ పిలిచి మాట్లాడతామని, అలాంటిది కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్దమనుషుల్లా వ్యవహరించడం లేదని ఆరోపించారు. హైకోర్టులో న్యాయవాదుల మధ్య గొడవ జరిగేందుకు కారకులెవరో ఆలోచించాలని సూచించారు.

ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, కేంద్ర మంత్రులు ఉత్సవ విగ్రహాల్లా తయారయ్యారు తప్ప ఇంకెందుకూ పనికిరారని మండిపడ్డారు. తెలుగుజాతి గురించి మాట్లాడే హక్కు కేవలం టీడీపీకే ఉందన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో కానీ, బాబ్లీ నీటి గురించి కానీ ప్రభుత్వాలు చేయలేని పనిని టీడీపీ చేసిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న ఉద్దేశంతోనే విభజన చిచ్చుపెట్టారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News