: ఆఫ్ఘన్ లో భారత రచయిత్రి కాల్చివేతపై కేంద్రం ఖండన
ఆఫ్ఘనిస్తాన్ లో నిన్న అనుమానిత తాలిబాన్ మిలిటెంట్ల చేతిలో కాల్చివేతకు గురైన భారత రచయిత్రి సుస్మితా బెనర్జీ హత్యోదంతంపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తున్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ వ్యవహారంలో ఆఫ్ఘన్ ప్రభుత్వంతో కలిసి విచారణ చేస్తామని చెప్పారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తుందన్నారు. 49 ఏళ్ళ బెనర్జీని నిన్న ఆఫ్ఘన్ లోని పక్తికా ప్రావిన్స్ లో ఆమె నివాసం వద్దే తాలిబాన్లు కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నేడు రాజ్యసభలో తృణమూల్ సభ్యుడు కునాల్ కుమార్ ఘోష్ లేవనెత్తారు.