: విశాఖ జిల్లా నుంచి బయల్దేరిన 4 వేలమంది ఉద్యోగులు
రేపు హైదరాబాదులో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరిట ఏపీఎన్జీవోలు తలపెట్టిన భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు సీమాంధ్ర ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి ఈ మధ్యాహ్నం నాలుగు వేలమంది ఉద్యోగులు వివిధ మార్గాల ద్వారా బయల్దేరారు. 36 బస్సుల్లో వెయ్యిమంది వరకు బయల్దేరగా, మిగతావారు రైళ్ళు, కార్లు, ఇతర వాహనాల్లో పయనమయ్యారు.