: కత్రినాకైఫ్ తో నిశ్చితార్థం లేదు: రణబీర్
కత్రినాకైఫ్ తో తనకు నిశ్చితార్థం జరగబోతోందంటూ వస్తున్న వార్తలను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కొట్టిపారేశాడు. రణబీర్ కపూర్ పుట్టిన రోజు ఈ నెల 28న జరగనుంది . అదే రోజు రణబీర్, కత్రినా పెళ్లిపై ప్రకటన వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో తన పుట్టినరోజు నాడు పెళ్లి నిశ్చితార్థం ఏదీ ఉండదంటూ రణబీర్ కపూర్ స్పష్టం చేశాడు. అయితే, 'ఎవరికి మీ జీవితం అంకితం చేస్తారంటూ' టైమ్స్ ఆఫ్ ఇండియా అడిగిన ప్రశ్నకు 'నా జీవితం ... నా కుటుంబం, ఆయాన్ (దర్శకుడు), కత్రినాకు అంకితం'అని రణబీర్ అసలు విషయం చెప్పేశాడు. కత్రినా తన జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా పేర్కొన్నాడు.