: ధర్మానను అడ్డుకున్న తెలంగాణ వాదులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో హైదరాబాదు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. మరోవైపు, నాంపల్లి కోర్టులో టీ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. టీ జేఏసీ శాంతి ర్యాలీ, బంద్ నేపథ్యంలో హైకోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో తెలంగాణ వాదులు నిరసన తెలుపుతున్నారు.
కాగా, జగన్ కేసులో మాజీమంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, నిత్యానందరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, నిమ్మగడ్డ ప్రకాశ్ హాజరయ్యారు. ఎమ్మార్ కేసులో బీపీ ఆచార్య, రాజగోపాల్, కోనేరు ప్రసాద్, విజయ రాఘవ కోర్టుకు హాజరయ్యారు.