: చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు విసిరిన వైకాపా కార్యకర్తలు


గుంటూరు జిల్లా తాడికొండ మండలం గరికపాడులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై కొందరు వైకాపా కార్యకర్తలు చెప్పులు విసిరారు. కాన్వాయ్ ని అడ్డుకుని జై వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో వైకాపా కార్యకర్తలవైపుకు దూసుకెళ్ళడంతో చంద్రబాబు వారిని వారించారు. వారు చేసినట్లే మనం చేస్తే వారికి, మనకి తేడా ఉండదన్నారు. అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న వ్యక్తులకు అనుకూలంగా ప్రవర్తించడం సిగ్గు చేటని చంద్రబాబు అన్నారు. జగన్ జైలుకెళ్లినట్టే వీరు జైలుకెళతారన్నారు. ఈ దాడిని తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.

  • Loading...

More Telugu News