: తమిళనాడు విద్యాశాఖ మంత్రికి ఉద్వాసన
తమిళనాడు విద్యాశాఖ మంత్రి వైగై చెల్వన్ కు మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికారు. ఈమేరకు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి పళణియప్పన్ కు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిత్వ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఆయనను ఎందుకు తొలగించారన్న విషయమై కారణాలు తెలియరాలేదు.