: ఈసారికి సమాచార హక్కు చట్టం సవరణ బిల్లు లేదు
సమాచార హక్కు చట్టానికి సవరణల బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రక్కన పెట్టింది. ప్రస్తుతం రాజకీయ పక్షాల మద్దతు లేనందున ఈ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిల్లులో సాధారణ పౌరులకో న్యాయం, రాజకీయనేతలకో న్యాయం అంటూ సవరణలు చేయడంపై మండిపడుతున్నాయి.