: రోబో తెలుసు.. మరి కిరోబో..?


రోబో అంటే మరమనిషి అని తెలుసుకదూ. అచ్చం మనలానే పనులు చేస్తాయి ఒక్క ఆలోచించడంతప్ప. రోబోలను ప్రపంచానికి పరిచయం చేసిన జపాన్ శాస్త్రవేత్తలే ఇప్పుడు మరో యంత్రుడికి రూపకల్పన చేశారు. పేరు కిరోబో. ఎత్తు 34 సెంటీమీటర్లు, బరువు కిలో. ఈ కిరోబో ఘనత ఏంటంటే.. ఇది అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఓ రేడియో మెసేజ్ ను వల్లె వేసింది. ఆగస్టు 4న ఇది ఓ కార్గో రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోకి పయనమైంది.

అక్కడికి చేరుకున్న పిమ్మట ఈ కిరోబో ఏమని సందేశం వెలువరించిందో తెలుసా..! 'భూమిపై ఉన్నవారందరికీ శుభోదయం. నేను కిరోబోను. నేను ప్రపంచంలోనే తొలి మాట్లాడే రోబోటిక్ వ్యోమగామిని. నైస్ టు మీట్ యూ' అని మాట్లాడింది. మనుషులు ఒంటరిగా ఎక్కడైనా సుదీర్ఘకాలం ఉండాల్సి వస్తే, అలాంటి వారికి రోబోలు ఎలాంటి భావోద్వేగపరమైన సహకారం అందిస్తాయో తెలుసుకునేందుకు ఉద్దేశించిన పరిశోధనలో భాగంగానే ఈ కిరోబోను అంతరిక్షంలోకి పంపారు.

  • Loading...

More Telugu News