: ఢిల్లీ ఎంపీకి సవాల్ విసిరిన రేణుక
పార్లమెంటులో సమైక్య నినాదాలు చేస్తున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ పై దూషణలపర్వానికి తెరదీసిన తూర్పు ఢిల్లీ ఎంపీ సందీప్ దీక్షిత్ కు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సవాల్ విసిరారు. కొద్దిరోజుల క్రితం దీక్షిత్.. శివప్రసాద్ ను ఉద్దేశించి 'ఢిల్లీలో ఎలా తిరుగుతావో చూస్తాను' అని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో దీక్షిత్ కనిపించిన సమయంలో రేణుక.. 'ఇదిగో దీక్షిత్ నేను ఢిల్లీలోనే ఉన్నా' ఏం చేస్తావన్నట్టుగా చాలెంజ్ చేశారు. దీక్షిత్ కు సవాల్ విసరకుముందు ఆమె మాట్లాడుతూ, దక్షిణాదివాళ్ళంటే అంత చులకనా? అని వ్యాఖ్యానించారు.