: ఫోటో జర్నలిస్టు అత్యాచార నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ
మహిళా ఫోటో జర్నలిస్టు అత్యాచార ఘటనలో నలుగురు నిందితులకు ఈనెల 19 వరకు ముంబయి మేజిస్ట్రేట్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నేటితో వారికి విధించిన పోలీసు కస్టడీ ముగియడం, మరోవైపు వారితో ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించాలని క్రైం బ్రాంచ్ కోరడంతో కోర్టు కస్టడీకి ఇచ్చింది. కాగా, ఈ కేసులో మైనర్ నిందితుడిని ఆగస్టు 30నే జువనైల్ కోర్టులో ప్రవేశపెట్టగా, అక్కడి నుంచి డోంగ్రీలోని జువనైల్ రిమాండ్ హోంకు పంపారు.