: కేదార్ నాథ్ లో 64 మృతదేహాలు
ఉత్తరాఖండ్ లోని రామ్ బడా, కేదార్ నాథ్ ల మధ్య గడిచిన ఐదు రోజుల్లో 64 మృతదేహాలు లభ్యమైనట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో పునరావాస చర్యలు వేగవంతం చేశారు. మరికొన్ని రోజుల్లో రామ్ బడా, గుర్గాన్, బీమ్ బాలి ప్రాంతాలకు రహదారుల సౌకర్యాన్ని మెరుగుపరిచి పూర్తిస్థాయిలో మృతదేహాల కోసం గాలించనున్నట్టు తెలిపారు.