: 'శాంతి ర్యాలీ'కి అనుమతివ్వాలని హైకోర్టులో పిటిషన్
టీఎన్జీవోలు ఈనెల 7న చేపడుతున్న 'శాంతి ర్యాలీ'కి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ శ్రీరంగరావు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు అనుమతించిన ప్రభుత్వం తమకెందుకు ఇవ్వదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఈ మధ్యాహ్నం లేదా రేపు హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.