: దిగ్విజయ్ ను కలిసిన టీ-కాంగ్ నేతలు


తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. మంత్రి జానారెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిని వివరించారు. అందులో సింహభాగం ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. హైదరాబాదులో సభల అనుమతి విషయంలో ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News