: ఉండవల్లి ప్రసంగాన్ని అడ్డుకున్న టీ-కాంగ్ ఎంపీలు
లోక్ సభలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలను సభలో ఉండవల్లి ప్రస్తావిస్తున్న సమయంలో ఎంపీలు అడ్డుకున్నారు. దీనిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర ఎంపీలెవరూ తమ నిరసన తెలపలేదని గుర్తు చేస్తున్నారు. ఉండవల్లి అంటే తెలంగాణ నేతలందరికీ భయమని, అతను వాదన వినిపించడం మొదలుపెడితే మొదటికే మోసం వస్తుందని తెలంగాణ ఎంపీలు అడ్డంపడ్డారని అంటున్నారు. ఉండవల్లిపై అధిష్ఠానానికి కూడా మంచి గురి ఉందని, అతను వాస్తవాలు మాట్లాడడం మొదలుపెడితే తెలంగాణ కల కల్లగా మిగిలిపోతుందనే భయంతోనే టీ-కాంగ్ ఎంపీలు అతని ప్రసంగాన్ని అడ్డుకున్నారని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.