: పెద్దపేగు క్యాన్సర్‌ను ముందే గుర్తించొచ్చు
పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్‌ను ముందే గుర్తించడానికి ఒక కొత్తరకం పద్ధతిని రూపొందించే దిశగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక కొత్త రకం పద్ధతిద్వారా పెద్దపేగుకు వచ్చే క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని, తద్వారా దీనికి తగు చికిత్సను తీసుకునేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పెద్ద పేగులో క్యాన్సర్ వ్యాధి రావడానికి దోహదం చేసే జన్యు మార్పులను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక కొత్త పద్థతిని రూపొందించారు. ఈ పద్ధతి అతి సున్నితమైనదని, దీనిద్వారా పెద్ద పేగుల్లో వచ్చే క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడానికి వీలవుతుందనే ఆశాభావాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. పెద్దపేగు క్యాన్సర్ బాధితుల్లో చాలామందిలో ఏపీసీ, కేఆర్‌ఏఎస్ జన్యువుల్లో మార్పులు తలెత్తుతుంటాయి. ఈ మార్పులు క్యాన్సర్ ఆరంభానికి ముందు కూడా కనబడతాయని, కాబట్టి ఇవి పెద్దపేగు క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడానికి దోహదం చేస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.