: దిగ్విజయ్ తో సీఎం మరోసారి సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో సమావేశం కానున్నారు. డిగ్గీ రాజాతో ఈ ఉదయం ఒకసారి భేటీ అయిన సీఎం ఆయనతో మరోసారి సమావేశమవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ తో సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి దిగ్విజయ్ తో భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.