: 19 షరతులతో సభకు అనుమతిచ్చాం: సెంట్రల్ జోన్ డీసీపీ
ఈ నెల 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు 19 షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. సభ సమయంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే అనుమతిని రద్దు చేస్తామన్నారు. ఏవైనా ఆస్తులు ధ్వంసమైనా బాధ్యత సభ నిర్వాహకులదేనన్నారు. కేవలం రెండు మైక్ సెట్లతో.. సభను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలవరకే నిర్వహించాలని చెప్పినట్లు డీసీపీ చెప్పారు. స్టేడియంలోకి ర్యాలీ, ప్రదర్శనగా రావడం నిషేధించినట్లు వివరించారు. అలాగే సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తామని పేర్కొన్నారు.