: ప్రేమపేరిట బాలికపై కాల్పులు.. కొత్త సంస్కృతి
పాశ్చాత్య సంస్కృతి తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సినిమాలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రేమ పేరిట పైత్యం ముదిరిపోతోంది. ప్రేమమైకంలో మునిగితేలుతున్న యువకులు ఏం చేస్తున్నారో తెలీని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లో మహిళలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి. లక్నోలో పదిహేనేళ్ల బాలికపై యువకుడు తరగతి గదిలోనే కాల్పులు జరిపి తనను తాను కాల్చుకున్నాడు. యువకుడు మృతి చెందగా, బాలిక చికిత్స పొందుతోంది.
బాలిక తరగతి గదిలోకి వెళ్లిన కాసేపటికే ఆమెకు బంధువయిన యువకుడు ఆమె కడుపు భాగంలో కాల్పులు జరిపాడు. తరువాత తన తలకి గురిపెట్టి కాల్చుకున్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించగా బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆమె నెమ్మదిగా కోలుకుంటోంది. హంతకుడు గత కొంతకాలంగా తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని బాలిక తెలిపింది. అలాగే అతని దగ్గర రెండు తుపాకులు ఉన్నాయని, ప్లాస్టిక్ సంచిలో బుల్లెట్లు పెట్టుకుని తిరుగుతాడని బాలిక పోలీసులకు తెలిపింది.