: సమైక్య ఉద్యమంలో స్వతంత్రంగానే ముందుకెళతాం: రాఘవులు
సమైక్యాంధ్ర ఉద్యమంలో స్వతంత్రంగానే ముందుకెళతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఏపీఎన్జీవోల సభలో పాల్గొనాలా? వద్దా? అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ వాదనలో మార్పు లేదని, తాము సమైక్యాంధ్రకే మద్దతుదారులమని తెలిపారు. వామపక్ష పార్టీలు ఐక్యతను కోరుకుంటాయని, కార్మికుల్లో ఐక్యతను కోరుకునే తాము విభజనను స్వాగతించలేమని అన్నారు.