: ఏపీఎన్జీవోల సభకు సాధారణ పౌరుడిగా హాజరవుతా: పయ్యావుల
ఏపీఎన్జీవోలు ఈనెల 7వ తేదీన హైదరాబాదులో నిర్వహించనున్న సమైక్యాంధ్ర సభకు సాధారణ పౌరుడిగా హాజరవుతానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుపై అజ్ఞానంతో షర్మిల మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోకుండా విభజనపై షిండే మాట్లాడటం దారుణమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని వారి అభిప్రాయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని పయ్యావుల స్పష్టం చేశారు.